Road Accident: మెదక్ జిల్లా వడియారంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
- మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం
- లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన మరో లారీ
- లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి
- మరో నలుగురికి తీవ్ర గాయాల
- ఇద్దరికి స్వల్ప గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్లక్ష్యం.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట(మం) వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కాగా.. క్షతగాత్రులకు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Also: Maldives: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూపై “చేతబడి”.. ఇద్దరు మంత్రులు అరెస్ట్..
Also Read
అయితే.. ఈ ప్రమాదంలో ఓ మృతదేహం క్యాబిన్లో ఇరుక్కోగా క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కి చెందిన వారీగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Read Also: Elephant Attack : మేఘాలయలో ఏనుగుల గుంపు దాడి.. ఎస్ఐ మృతి, కానిస్టేబుల్‌కు గాయాలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!