Site icon NTV Telugu

Road Accident: మెదక్ జిల్లా వడియారంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident Pak

Road Accident Pak

నిర్లక్ష్యం.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట(మం) వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కాగా.. క్షతగాత్రులకు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read Also: Maldives: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూపై “చేతబడి”.. ఇద్దరు మంత్రులు అరెస్ట్..

అయితే.. ఈ ప్రమాదంలో ఓ మృతదేహం క్యాబిన్లో ఇరుక్కోగా క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతులంతా మధ్యప్రదేశ్కి చెందిన వారీగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Read Also: Elephant Attack : మేఘాలయలో ఏనుగుల గుంపు దాడి.. ఎస్ఐ మృతి, కానిస్టేబుల్‌కు గాయాలు

Exit mobile version