NTV Telugu Site icon

World Record: 6రోజుల్లోనే ప్రపంచ 7వింతల సందర్శన.. గిన్నీస్ రికార్డు..

Magdy Eissa

Magdy Eissa

World Record: ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ప్రపంచంలోని 7 అద్భుతాలను చూడాలని కలలు కంటాడు. ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి వాటిని సందర్శించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈజిప్టు నివాసి కేవలం 6 రోజుల్లో ప్రపంచంలోని 7 అద్భుతాలను సందర్శించాడు. తన కృషితో అతి తక్కువ సమయంలో ప్రపంచంలోని 7 అద్భుతాలను వీక్షించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్.. తండ్రి కేబినెట్‌లో కీలక పదవి!?

ఈజిప్టు దేశానికీ చెందిన వ్యక్తి పేరు మాగ్డీ ఐస్సా. అతని వయస్సు 45 సంవత్సరాలు. అతను కేవలం 6 రోజుల 11 గంటల 52 నిమిషాల్లో ప్రపంచంలోని 7 అద్భుతాలను సందర్శించాడు. ఇకపోతే ఈ రికార్డు మాగ్డీ కంటే ముందు బ్రిటన్ నివాసి జామీ మక్డోనాల్డ్ పేరిట ఉంది. 6 రోజుల 16 గంటల 14 నిమిషాల్లో 7 అద్భుతాలను సందర్శించాడు. మాగ్డి ఈ రికార్డును జామీ సమయం కంటే నాలుగున్నర గంటల ముందుగానే పూర్తి చేశాడు.

NCERT: ఒప్పంద ప్రాతిపదికన 90 పోస్టుల భర్తీ.. భారీగా జీతం...

ఇక ఈ విషయాన్ని గిన్నీస్ బుక్ గుర్తించి తన ఇన్ స్టాలో షేర్ చేసింది. మాగ్దే ఈ యాత్రను చైనా లోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో ప్రారంభించి., ఆగ్రా నగరంలోని తాజ్ మహల్, జోర్డాన్ లోని పురాతన నగరం పెట్రా, ఇటలీ దేశంలోని రోమ్ కొలీజియం, బ్రెజిల్ లోని క్రీస్ట్ ఆఫ్ రిడీమర్, పెరులోని మచుపిచు, మెక్సికో లోని షింషెన్ ఇట్జా పురాతన నగరాన్ని సందర్శించి తన 7 ప్రపంచ వింతల యాత్రను పూర్తి చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. యాత్ర మొత్తం ఎక్కడా కూడా ఒక్క ప్రైవేటు వాహనం ఉపయోగించకుండా కేవలం ప్రజా రవాణాల్లోనే ప్రయాణించడం. ఈ యాత్రను ప్లాన్ చేసుకునేందుకు 18 నెలల సమయం పట్టిందని మాగ్దే తెలిపారు.