NTV Telugu Site icon

Delhi: పార్లమెంట్ ముట్టడికి రైతుల పిలుపు.. బోర్డర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Noida

Noida

అన్నదాతలు మరోసారి పార్లమెంట్‌ ముట్టడికి (Parliament) పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం భారీగా నోయిడా, హర్యానా, యూపీ నుంచి పెద్ద ఎత్తున రైతులు (Farmers Protest) బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులు ఢిల్లీలోకి (Delhi) ప్రవేశించకుండా సరిహద్దులో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ఇనుప కంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలోకి వచ్చే వాహనాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయియి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డిమాండ్లు ఇవే..
గ్రేటర్ నోయిడాలోని 140కి పైగా గ్రామాల రైతులు తమ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం పార్లమెంట్ వైపు పాదయాత్రను ప్రారంభించారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అధికారులు సేకరించిన భూమిలో తమ కుటుంబాలకు 10% నివాస స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించినప్పుడు మార్కెట్ ధరల ఆధారంగా అదనపు ద్రవ్య పరిహారాన్ని కూడా ఇవ్వాలని వారు కోరుతున్నారు. రైతులంతా ఢిల్లీ మార్చ్ చేపట్టడంతో నోయిడా సరిహద్దులో వాహనాలతో కిక్కిరిపోయాయి.