farmers Support to Wrestlers: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు మద్ధతుగా రేపు రైతులు పెద్ద సంఖ్యలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో తమ నిరసనను ప్రారంభించిన రెజ్లర్లు, మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Read Also: Burnt Alive: కారులో చెలరేగిన మంటలు.. నూతన వధూవరులతో పాటు నలుగురు సజీవదహనం
మంగళవారం ఒలింపిక్ పతక విజేతలైన సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, మరియు ఆసియా క్రీడల ఛాంపియన్ వినేష్ ఫోగట్‌లతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోకపోవడంతో నిరసనగా హరిద్వార్‌లోని గంగా నది తమ ప్రపంచ, ఒలింపిక్ పతకాలను పవిత్ర గంగా నదిలో పడేస్తామని ప్రకటించారు. అయితే టికాయత్, ఇతర రైతు నాయకులు 5 రోజులు ఆగాలని కోరారు. వారి కోరిన నేపథ్యంలో తమ పతకాలను గంగా నదిలో వేసే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తమ మాట మేరకు రెజ్లర్లు నిరసన కార్యక్రమం వాయిదా వేయడంతో వారికి మద్ధతు రేపు సౌరం పట్టణంలో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రెజ్లర్లు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకుంటామని టికాయత్ ప్రకటించారు. గురువారం జరిగే సమావేశానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ నుండి వివిధ ఖాప్‌ల ప్రతినిధులు, వారి అధిపతులు హాజరవుతారని.. నిరసనలో తదుపరి దశలను నిర్ణయించాలని భావిస్తున్నట్టు తెలిపారు.