టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు మూవీ తో ఫరియా అబ్దుల్లా వెండి తెర కు పరిచయమైంది. నూతన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల తో పోటీ పడి మరీ ఫరియా కామెడీ పంచింది.జాతిరత్నాలు మూవీ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. ‘జాతిరత్నాలు’ సినిమా లో ఫరియా అబ్దుల్లా నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ బ్యూటి.యంగ్ హీరో అయిన నవీన్ పొలిశెట్టి సరసన ఈ ముద్దుగుమ్మ అద్భుతం గా నటించింది. లాయర్ చిట్టి పాత్రలో అందరికి ఫుల్ ఫన్ అందించింది.జాతిరత్నాలు సినిమా ఆమె సినీ కెరీర్ కు బాగా ఉపయోగపడింది.. .
మొదటి చిత్రం హిట్ అవ్వడం తో ఫరియాకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు దక్కాయి. ఆ వెంటనే ‘బంగార్రాజు’ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో మెరిసి అందరిని అలరించింది.. బంగార్రాజు సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఫరియాకు మరింత క్రేజ్ పెరిగింది.కానీ ఆ తర్వాత వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, సినిమా అంతగా మెప్పించలేకపోయింది.అలాగే రీసెంట్ గా వచ్చిన ‘రావణసుర’ చిత్రంలో కూడా నటించింది ఫరియా. కానీ ఆ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నిస్తుందిఈ భామ.ఫరియా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా నే ఉంటుంది..వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా చీరకట్టులో మెరిసింది ఈ భామ.సముద్రపు ఒడ్డున ఫరియా చీరకట్టు లో సందడి చేసింది.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో ఆకట్టుకుంది.. మరోవైపు బ్లౌజ్ పై నుంచి కొంగు జారిపోతున్నా పట్టించుకోవట్లేదు.కిల్లింగ్ లుక్స్ తో ఈ ముద్దుగుమ్మ రెచ్చగొడుతుంది.
