యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా.. ఈ మూవీ నవంబర్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీడా కోలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఈవెంట్ కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు..కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కథపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.. ప్రతి ఫ్యామిలీ లో నుంచి ఓ పిల్లాడు ఆ ఫ్యామిలీ కష్టాలను, డైరెక్షన్‌ను, ఫ్యూచర్ జనరేషన్‌ను మార్చేస్తాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అలాంటి కథే అని తెలిపాడు. ఆ సినిమా తన రియల్ లైఫ్‌కు కనెక్ట్ అయ్యిందని తెలిపాడు. నా వల్ల నా ఫ్యామిలీ లైఫ్ అంతా మారింది. తరుణ్ కారణంగా వాళ్ల ఫ్యామిలీ లైఫ్ మారిపోయిందని విజయ్ తెలిపాడు.చిన్నతనం నుంచి తాను ఎన్నో భయాలతోనే పెరిగానని, అలాంటి భయాలను బ్రేక్ చేసే ఒక్కడు రావాలని విజయ్ తెలిపాడు.
ఫ్యామిలీ స్టార్ టీజర్‌లోని ఐరెన్ వంచాలా ఏంటి.. అనే డైలాగ్‌ను పూర్తిగా మార్చేసి చెప్పాడు విజయ్ దేవరకొండ. మధ్య తరగతి వాళ్లమైతే కలలు కనలేమా ఏంటి..ఈ రోజు డబ్బులు లేకపోతే రేపు సంపాదించలేమా ఏంటి.. ఎవడు అడ్డొచ్చిన గెలవలేమా ఏంటి.. అని విజయ్ దేవరకొండ అన్నాడు. ఫ్యామిలీ స్టార్ గురించి అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోన్నాయి.తనను హీరోగా అభిమానులకు పెళ్లిచూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ పరిచయం చేశాడని కీడాకోలా ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తెలిపాడు.. అలాగే . నాగ్ అశ్విన్, సందీప్ వంగా, తరుణ్ భాస్కర్ పరిచయంతోనే తన జీవితం మారిపోయిందని విజయ్ తెలిపాడు. ఎక్కడెక్కడో నుంచి వచ్చిన తమను సినిమానే కలిపిందని విజయ్ దేవరకొండ అన్నాడు.ఇండస్ట్రీలో మా అందరికి అస్సలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని, అయినా కూడా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచి ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చామని విజయ్ దేవరకొండ తెలిపాడు. పాకెట్‌లో ఒక్క రూపాయి కూడా లేకపోయినా ఈ ప్రపంచం మాదే అనే కాన్ఫిడెన్స్‌తో మేము తిరిగేవాళ్లమని, ఆ మైండ్‌సెట్ తాము ఎదగడానికి ఉపయోగపడిందని విజయ్ దేవరకొండ తెలిపారు.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…