Site icon NTV Telugu

Pet Dog Birthday: గ్రాండ్‎గా పెంపుడు కుక్క బర్త్ డే.. దాని డ్రస్ కాస్ట్ ఎంతో తెలుసా

Pet Dog Birthday Party

Pet Dog Birthday Party

Pet Dog Birthday: చాలా మంది పెంపుడు జంతువులను తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. వాటికి ఏమాత్రం చిన్న గాయమైన అల్లాడిపోతుంటారు. ఈ మధ్య కాలంలో వాటి యజమానులు వాటి జీవితంలోని ప్రత్యేక సందర్భాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. సోషల్ మీడియా పుణ్యమాని ఈ వార్తలు ఇప్పుడు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో ఓ కుటుంబం త‌మ పెంపుడు కుక్క అక్సర్ బ‌ర్త్‌డే వేడుకల‌ను గ్రాండ్ గా నిర్వహించింది. కుక్క య‌జ‌మానులు బర్త్ డే పార్టీకి రావాలని దాదాపు 350 మందిని ఆహ్వానించారు. ఇన్విటేష‌న్ కార్డులను ముద్రించి పంచారు. దాని కోసం ప్రత్యేకంగా రూ . 4500 వెచ్చించి కొత్త డ్రస్ కొనుగోలు చేశారు.

Read Also: Mine Collapses : ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన గని.. ఏడుగురు మృతి

ఇక బర్త్ డే రోజు ప‌రిస‌ర గ్రామాల నుంచే కాకుండా బెంగాల్‌లోని శ్రీపూర్ వంటి ప్రాంతాల నుంచి అతిథులు ధ‌న్‌బాద్‌కు క్యూ క‌ట్టారు. బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న కుక్క కు బంధువులు కాస్ట్ లీ గిఫ్ట్ లను తీసుకొచ్చారు. అంతే కాకుండా కుక్క కోసం మూడు గోల్డ్ లాకెట్స్‌ను కొందరు బ‌హూక‌రించారు. అక్సర్ బర్త్ డే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుక్కను మ‌హిళ ముద్దాడడం కనిపించింది. టేబుల్ పైన భారీ కేక్ కూడా ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు. రోడ్డు ప్రక్కన 20రోజులున్నపుడు అక్సర్ ను తెచ్చి పెంచుకుంటున్నట్లు యజమాని సుమిత్రకుమారి, సందీప్ చెప్పారు.

Exit mobile version