Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ మెహందీ కలకలం..

Hyd

Hyd

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ మెహందీ కలకలం సృష్టించింది. మహమ్మద్ అబ్దుల్ వసీం అనే వ్యక్తి కరాచీ పేరుతో డూప్లికేట్ మెహందీ తయారు చేస్తున్నాడు. ఈ మెహందీని మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా ముస్తఫా హిల్స్‌లో ఉన్నా మస్రత్ మెహందీ యూనిట్‌పై దాడి చేశారు. మెహందీ కోన్‌లు, మిషన్లు అన్ని కలిపి దాదాపు రూ. అయిదు లక్షల మేర ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ అబ్దుల్ వసీం 38 అనే వ్యక్తి వట్టేపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ముస్తఫా హిల్స్ గౌస్ నగర్‌లో మస్రత్ మెహందీ యూనిట్ మ్యానిఫెక్చర్ కంపెనీ లైసెన్స్ తీసుకొని కోన్‌లు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు.

REDA MORE: Off The Record: ఆకుల లలితకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ నేతలు జట్టుకట్టారా?

కానీ అవి మార్కెట్‌లో అంతగా ఎవరు ఇష్టపడలేదు. కరాచీ పేరుతో గల మెహందీకి బాగా డిమాండ్ ఉన్నట్లు గ్రహించాడు. కరాచీ పేరుతో డూప్లికేట్ మెహందీ కోన్‌లు తయారు చేశాడు. అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. ఈ అంశంపై సమాచారం అందుకొన్న సౌత్ ఈస్ట్ టాస్క్ ఫర్స్‌ అధికారులు.. బండ్లగూడ పోలీసుల సహకారంతో వసీంని అదుపులోకి తీసుకున్నారు. యూనిట్‌లో సామాగ్రి విలువ అయిదు లక్షల మేర ఉంటుందని పోలీసులు తెలిపారు.

REDA MORE: Off The Record: దానం నాగేందర్ కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉందా?

Exit mobile version