NTV Telugu Site icon

Fake Hair Growth Scam: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ వందల మందికి గుండు కొట్టేసిన ఘనుడు

Fake Hair Growth Scam

Fake Hair Growth Scam

Fraud Treatment: ప్రస్తుతకాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటిగా బట్టతల మారింది. ఈ సమస్యతో ఎంతో మంది యువకులు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఈ మధ్యకాలంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం సాధారణంగా కనిపిస్తూనే ఉంది. పరిస్థితులు ఏవైనా కావొచ్చు.. ఈ సమస్య మాత్రం దేశంలో పెద్దమొత్తంలోనే ఉంది. ఈ బట్టతలతో బయటకి వెళ్లాలన్నా, ముఖ్యంగా యువకులు పెళ్లి విషయంలో అయినా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే అసహాయతను అవకాశంగా మలుచుకుని ఓ సెలూన్ షాప్ ఓనర్ జనాల చూపును తన వైపుకు తిప్పుకుందేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు. దానితో.. కొద్దీ రోజుల్లోనే పెద్దఎత్తున యువకులను తన షాపు ముందు క్యూలు కట్టేలా చేసాడు. మరి ఈ సెలూన్ షాప్ వ్యవహారమేంటో ఒకసారి చూద్దామా..

విక్రమార్కుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం.. ఈ సినిమాలో హీరో చిన్న చిన్న మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. అంతేకాకుండా దొంగతనాలు చేస్తుంటాడు.. అలా హీరో ఒక వీధిలోకి వెళ్లి అందరికీ మాయమాటలు చెప్పి అరగుండు కొట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మరొకడు వచ్చి గుండ్లు చేస్తామంటూ ప్రకటనలు ఇస్తాడు.. ఇలా వేల రూపాయలు వసూలు చేస్తాడు. ఇలాంటి వ్యవహారమే హైదరాబాదులో తాజాగా వెలుగు చూసింది.

ఢిల్లీకి చెందిన వకీల్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రకటన చేశాడు.. ఈ వకీల్ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న వ్యక్తికి ఇలా చేయడంతో వెంట్రుకలు వచ్చాయంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత పాతబస్తీలో తన మిత్రుడైన కి ఒక షాపు ఉందని అక్కడికి తాను వస్తున్నానని చెప్పాడు. దీంతో పాతబస్తీలోని పతే దర్వాజా ప్రాంతంలోని బిగ్ బాస్ సెలూన్ కి ఆదివారం నాడు వచ్చాడు. వకీల్ వస్తున్న సమాచారం ముందుగానే సోషల్ మీడియాలో పెట్టడంతో వందలకొద్దీ బట్టతల యువకులు షాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయింది.. తమకు గుండు చేసి వెంట్రుకలు మొలిపించాలని అందరూ పట్టుబట్టడంతో.. ఒక్కొక్క గుండుకు వంద రూపాయలు చొప్పున వసూలు చేసి కొన్ని కెమికల్స్ రాసి పంపించాడు.

ఆ తర్వాత కొన్ని షరతులు కూడా పెట్టాడు. గుండు ఆరిపోకుండా ఉండాలని, గుండు పైన నీళ్లు చల్లుతూ ఉండాలని.. నీళ్లు కిందికి జారకుండా బట్ట కట్టాలి అంటూ షరతులు పెట్టి పంపించాడు. అలా గుండు గీయించుకొని కెమికల్ రాయించుకొని వెళ్లిన వారందరికీ మంట రావడంతో పాటు కొందరికి రియాక్షన్స్ అయి బొబ్బలు వచ్చాయి.. దీంతో లబోదిబో అంటూ చాలామంది ఆస్పత్రికి వెళ్లారు.. సాయంత్రం వరకు కొన్ని వందల మందికి గుండు గీసి డబ్బులు పట్టుకొని వకీల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాతబస్తిలో సంచలనం రేకెత్తిస్తుంది. బట్టతల మాట ఏమో కానీ.. ఉన్న వెంట్రుకలు పోయాయని అందరూ బాధపడుతున్నారు.