Site icon NTV Telugu

PIB Fact Check: నో ‘ఫ్రీ స్యూటీలు’.. ఫ్యాక్ట్‌చెక్ షాకింగ్ పోస్ట్

11

11

PIB Fact Check: భారతదేశం అంతటా ఉన్న మహిళలు, బాలికలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత స్కూటీలను అందిస్తుందని యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో వాస్తవం ఎంత ఉందో నిర్థారించడానికి PIB రంగంలోకి దిగింది. దాని అధికారిక తనిఖీ హ్యాండిల్ @PIBFactCheck ద్వారా షేర్ చేసిన పోస్ట్‌లో అటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని ధృవీకరించింది. ఈ వీడియో పూర్తిగా అబద్ధమని, ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని పేర్కొంది.

READ MORE: Off The Record: పూజారుల పొలిటికల్ టచ్అప్! జోగులాంబలో కాంగ్రెస్, బీఆర్ఎస్గా చీలికలు!

తప్పుడు వార్త..
కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా స్కూటీలను అందిస్తోందని #YouTube ఛానెల్ ‘techayasfacts’ ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఈ వార్త నకిలీదని PIBFactCheck పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ‘ఉచిత స్కూటీ పథకం’ను నిర్వహించడం లేదని @PIBFactCheck ద్వారా షేర్ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కచ్చితమైన, ప్రామాణికమైన సమాచారం కోసం @PIBFactCheck లేదా సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

ప్రభుత్వ ఛానెళ్లపైనే ఆధారపడాలి..
PIBFactChec తన పోస్ట్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ప్లామ్‌ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం గురించి ఆందోళనలను లేవనెత్తింది. ఇటువంటి తప్పుడు వాదనలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని, ముఖ్యంగా బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు లేదా ఆర్థిక ప్రయోజనాలను వాగ్దానం చేసినప్పుడు ఎక్కువగా ప్రజలు గందగోళానికి గురి అవుతుంటారని పేర్కొంది. ప్రభుత్వ పథకాలను ధృవీకరించడానికి, సలహా, సంక్షేమ పథకాలు, ప్రజా కార్యక్రమాలకు సంబంధించిన కొత్త విషయాల గురించి ప్రామాణికమైన ప్రభుత్వ ఛానెళ్లపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. కచ్చితమైన సమాచారం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్‌ను లేదా సోషల్ మీడియాలో PIBFactCheckని అనుసరించాలని సూచించింది. ఆన్‌లైన్లో తప్పుడు సమాచారం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ధృవీకరించిన, నమ్మదగిన వార్తలను అందజేయడంలో వాస్తవ తనిఖీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. PIB ఫ్యాక్ట్ చెక్ వంటి యూనిట్లు తప్పుడు వాదనలను గుర్తించడంలో, వాటిని తోసిపుచ్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది.

READ MORE: AP Liquor Scam : క్లైమాక్స్‌కు చేరుకున్న దర్యాప్తు !

Exit mobile version