Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..

Fake Noc

Fake Noc

హైదరాబాద్‌లో ప్రైవేటు జూనియర్ కళాశాలల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్గిపెట్టెలాంటి భవనాల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండానే జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐదు అంతస్తుల భవనాలకు కేవలం ఒకే ఒక్క ఎంట్రీ ఉండటం, ప్రమాదం జరిగితే విద్యార్థులు బయటకు వచ్చేందుకు కనీసం దారి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫైర్ ఇంజన్ రావడానికి కూడా వీలులేని అత్యంత ఇరుకైన సందుల్లో ఈ విద్యాసంస్థలను నడుపుతున్నారు. హైడ్రా (HYDRAA) నిబంధనల ప్రకారం పలు కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ నిరాకరించినప్పటికీ, అసలు అనుమతులకే దరఖాస్తు చేయకుండా ఏకంగా 6 నుంచి 10 లక్షల రూపాయలు చెల్లించి నకిలీ ఎన్ఓసీలు తెచ్చుకుని ఇంటర్ బోర్డు అనుమతుల కోసం సమర్పించారు.

మొత్తం 142 తనిఖీ చేసిన కళాశాలల్లో ఏకంగా 52 కాలేజీలు ఇలాంటి నకిలీ పత్రాలతో నడుస్తున్నట్లు ఆధారాలు లభించాయి. అగ్నిమాపక శాఖ మాజీ డీజీ నాగిరెడ్డితో పాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఎన్ఓసీల వెనుక ఒక పెద్ద ముఠా ప్రమేయం ఉందని అనుమానిస్తున్న పోలీసులు, ఆ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైడ్రా కమిషనర్ సమగ్ర నివేదికను పోలీసులకు అందజేయడంతో ప్రస్తుతం విచారణ వేగవంతమైంది.

నకిలీ ఫైర్ ఎన్ఓసీలు కలిగి ఉన్నట్లు గుర్తించిన 52 కళాశాలల్లో బాబుల్ రెడ్డి జూనియర్ కాలేజ్ (ఎర్రగడ్డ), న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (టోలిచౌకి), అలీ శాంతినికేతన్ జూనియర్ కాలేజ్ (మెహదీపట్నం), శ్రీ అక్షర జూనియర్ కాలేజ్ (ఎల్లారెడ్డిగూడ), అచీవర్ జూనియర్ కాలేజ్ (టోలిచౌకి), హిదాయా జూనియర్ కాలేజ్ (ఆసిఫ్‌నగర్), జునైద్ జూనియర్ కాలేజ్ (హుమాయున్‌నగర్), సెయింట్ ప్రాక్టిక్స్ ఆటిట్యూడ్ జూనియర్ కాలేజ్ (నల్లకుంట), ఫిడ్జీ జూనియర్ కాలేజ్ (నారాయణగూడ), శ్రీ వాణి జూనియర్ కాలేజ్ (మలక్‌పేట్), ఎస్‌వీ జూనియర్ కాలేజ్ (చంపాపేట్), శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజ్ (సంతోష్‌నగర్), విజినరీ జూనియర్ కాలేజ్ (షాలిబండ), ముషీరాబాద్ జూనియర్ కాలేజ్ (జమిస్తాన్‌పూర్), సరోజినీ నాయుడు జూనియర్ కాలేజ్ (చిక్కడపల్లి), లైఫ్ లైన్ జూనియర్ కాలేజ్ (చార్మినార్), నానో జూనియర్ కాలేజ్ (నల్లకుంట), ఆధ్య జూనియర్ కాలేజ్ (దిల్‌సుఖ్‌నగర్), హిదయ జూనియర్ కాలేజ్ (సంతోష్‌నగర్), IACG CG వొకేషనల్ జూనియర్ కాలేజ్ (మూసారాంబాగ్), శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ (సికింద్రాబాద్), సింధు జూనియర్ కాలేజ్ (మెహదీపట్నం), మాస్టర్ జూనియర్ కాలేజ్ (యూసుఫ్‌గూడ), ఎస్‌వీపీ శ్రీ వెంకటేశ్వర పద్మావతి జూనియర్ కాలేజ్ (బోరబండ), సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ (బేగంబజార్) ఉన్నాయి.

వీటితో పాటు.. విదేశా జూనియర్ కాలేజ్, శ్రీ మేధా జూనియర్ కాలేజ్ (అత్తాపూర్), ఎక్స్లెన్సీ/ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్ (మదీనాగూడ), విశ్వ భారతి జూనియర్ కాలేజ్ (హైదర్‌షాకోట్), వికాస్ జూనియర్ కాలేజ్ (వనస్థలిపురం), శ్రీ తపస్య జూనియర్ కాలేజ్ (బండ్లగూడ జాగీర్), జ్ఞాన దీపిక జూనియర్ కాలేజ్ (మాదాపూర్), భార్గవ జూనియర్ కాలేజ్ (సరూర్‌నగర్), విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ (యాప్రాల్), శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్ (అల్వాల్), సీఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ (ఈసీఐఎల్), ఎక్స్లెన్సీ జూనియర్ కాలేజ్ (పేట్ బషీరాబాద్), శ్రీ నారాయణ కామర్స్ జూనియర్ కాలేజ్ (ఉప్పల్), ఎక్సలెన్సీ కాలేజ్ (దమ్మాయిగూడ), శ్రీ చైతన్య భారతి కాలేజ్ (షేర్‌లింగంపల్లి), ఇక్బాల్/ఇక్బాలియా జూనియర్ కాలేజ్ (రాజేంద్రనగర్), కైట్స్ జూనియర్ కాలేజ్ (ఓల్డ్ బోయిన్‌పల్లి), కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ (పేట్ బషీరాబాద్), శ్రీ చైతన్య భారతి జూనియర్ కళాశాల (చందానగర్), ఇక్బాలియా జూనియర్ కళాశాల (అత్తాపూర్), నారాయణ జూనియర్ కాలేజ్ (రాయదుర్గం), శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (కుకట్‌పల్లి), గాయత్రి జూనియర్ కాలేజ్ (మలక్‌పేట్), వివేకానంద జూనియర్ కాలేజ్ (నిజాంపేట్), భాష్యం జూనియర్ కాలేజ్ (కేపీహెచ్‌బీ), ఆర్కే జూనియర్ కాలేజ్ (రామంతాపూర్), కృష్ణవేణి జూనియర్ కాలేజ్ (దిల్‌సుఖ్‌నగర్) ఉన్నాయి.