కొంత కేటుగాళ్లు నకిలీలు సృష్టించడంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారను. తమ జల్సాల కోసం ప్రతి దాన్ని కాఫీ చేసి దాన్ని క్యాష్ చేసుకుంటారు. సేమ్ అలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సార్ట్ వేర్ ఇంజినీర్ వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ గా పోలీసులు గుర్తించారు. తన జల్సాలు, విలాసాల కోసం నకిలీ ఐఆర్ఎస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మరియు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా నకిలీ ఐడీ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ మరియు ఆధార్ కార్డ్స్ తయారు చేసుకొని వాటి ద్వారా గరుడ సేవకు వీఐపీ బిగ్ బ్యాడ్జ్ పాస్ ను, వీఐపీ ప్రోటోకాల్ దర్శనాన్ని అతడు పొందాని పోలీసులు వెల్లడించారు. ఫేక్ ఐడీ కార్డ్స్ తో మోసం చేసినందులకు గాను తిరుమల టు టౌన్ పోలీసు స్టేషన్ లో నిందితుడు వేదంతం శ్రీనివాస భరత్ భూషణ్ పై రెండు కేసులు నమోదు చేశారు.
Fake ED Commissioner: తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను అరెస్టు..
Show comments