Site icon NTV Telugu

ఉస్మానియా ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

ఉస్మానియా ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ ఘటన కలకలం రేపింది. ఉస్మానియా ఆసుపత్రి లో నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్న నిందితున్ని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఉస్మానియా ఆసుపత్రి కి అలీ అనే వ్యక్తి డాక్టర్ కోట్‌, మెడలో స్టెతస్కోప్ వేసుకొని దర్జాగా ఆసుపత్రి అత్యవసర విభాగం లో తోటి వైద్యులతో సమానంగా కూర్చున్నాడు. అయితే… కొద్దీ సేపటి తర్వాత క్యాజ్‌వాలిటీ సీఎంఓ అతని ప్రవర్తన పై ఆరా తీసారు. పొంతన లేని సమాధానాలు చెపుతుందడంతో… ఇతడు నకిలీ వైద్యుడు గా గుర్తించారు. దీంతో అతన్ని పట్టకుని… వెంటనే స్థానిక అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు…. విచారణ చేసి… అలీని నకిలీ వైద్యుడిగా తేల్చారు. అనంతరం ఆ నిందితుని పై 170, 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Exit mobile version