NTV Telugu Site icon

Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా..? మీరు మోసపోయినట్లే..?

Google Scame

Google Scame

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో కనిపంచే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా షేక్ డేటానే పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరికి ఏదైనా కావాలంటే గూగుల్ లోనే సెర్చ్ చేస్తుంటారు. గూగుల్ చూపించే డేటాపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సాధారణంగా చాలామంది గూగుల్ మ్యాప్స్ లో హోటళ్లను సెర్చ్ చేస్తుంటారు. ముందుగానే అక్కడి హోటళ్లలో రూమ్ బుకింగ్ చేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది స్కామర్ల చేతుల్లో మోసపోతున్నారు. వాస్తవానికి గూగుల్ హోటల్ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ ద్వారా ఆన్ లైన్ మోసగాళ్లు యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందులో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Bhandavi Sridhar: అర్థంపర్థం లేకుండా ఇంతా అందంగా ఉన్నావ్ ఏంటి పిల్లా?

మీరు ఆన్ లైన్ లో హోటళ్లను బుక్ చేసుకుంటే.. ఈ కొత్త స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.. స్కామర్లు ఇప్పుడు వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు గూగుల్ లో ఫేక్ కస్టమర్ నంబర్ లను పోస్ట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్, భారత్ లోని హోటళ్లను లక్ష్యంగా చేసుకునే స్కామర్లు ఈ కొత్త స్కామ్ కు పాల్పడున్నారని గుర్తించింది. ఈ స్కామ్ లో గూగుల్ లోని హోటల్ లిస్టింగ్ లలో పోస్ట్ చేసిన పేక్ కస్టమర్ కేర్ నంబర్లు ఉంటాయి. ఈ నంబర్లు కస్టమర్లను ఆకర్షించేలా క్రియేట్ చేస్తారు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీతో యూజర్లుచదవులేని విధంగా ఉంటాయి. కానీ, యూజర్లు సులభంగా చదవగలిగేలా ఉంటాయి. ఇలాంటి డేటాపై క్లౌడ్ సెక్ లోతుగా విశ్లేషించింది. స్కామర్లు ఒకే రకమైన హోటల్ రూమ్ ఫోటోలను వివిధ పోన్ నంబర్ లతో పోస్ట్ చేస్తున్నారు. కస్టమర్ లను మోసం చేసేందుకే ఈ ఫోటోలను లిస్టు రివ్యూ సెక్షన్ లోనూ సైబర్ నేరగాళ్లు అప్ లోడ్ చేస్తున్నారు.

Also Read : Immoral Relationship : ప్రియుడిని అన్నయ్య అంది.. అతడి చేతిలోనే హతమైంది

భారత్ లోని వివిధ రాష్ట్రాల్లోని హోటళ్లే లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ఈ తరహా మోసాలకు పాల్పడున్నారని తేలింది. ఇందులో జగన్నాథ్ పూరి, ఉజ్జయిని, వారణాసి వంటి పవిత్రమైన నగరాలు కూడా ఉన్నాయి. అన్నీ ధరల కేటగిరీల హోటళ్లు, హోమ్ స్టేలు లక్ష్యంగా కనిపిస్తున్నాయి. స్కామర్ లు ఎప్పటికప్పుడు కొత్త గూగుల్ అకౌండ్లను క్రియేట్ చేస్తున్నారని, స్కామ్ ను కొనసాగించడానికి కొత్త ఫోన్ నంబర్లను కూడా ఉపయోగిస్తారని నివేదిక పేర్కొంది. ఈ స్కామ్ ల వెనుక ఎవరిదైన హస్తం ఉందా.. లేదా అనే కోణంలో విచారణ జరుగుతుంది.

Also Read : Kiran Abbavaran: మార్చ్ 29న మాస్ ‘మీటర్’ ఎంతో చూపించబోతున్నాడు

ముఖ్యంగా, ట్రూకాలర్ ప్రొఫైల్ లోని స్కాన్ చేసిన నంబర్ లతో లింక్ చేసిన పేర్లు, గూగుల్ అకౌంట్లరకు లింక్ చేసిన పేర్లతో సరిపోలడం లేదని గుర్తించింది. మల్లీ గూగుల్ అకౌంట్లు ఒకే హోటల్ లిస్టులో వేర్వేరు పోన్ నంబర్లను కలిగి ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ఈ స్కామ్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ సెల్ కు సమాచారం అందించింది. ఈ స్కామ్ బారిన పడకుండా తమ కస్టమర్ లను రక్షించుకునేందుకు హోటల్ లు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని క్లౌడ్ సెక్ సూచించింది.

Show comments