NTV Telugu Site icon

పుష్ప తో నా క్రేజ్ ఏం పెరగలేదు..ఫహాద్ షాకింగ్ కామెంట్స్…

Faaajil

Faaajil

ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. కలెక్షన్స్ అదరగొట్టింది..

ఇదిలా ఉండగా.. ఫహాద్ పుష్ప గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్ మొదట్లో నటుడిగా పరిచయం అయి, ఆ తర్వాత అదే క్రేజ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చివరి 20 నిమిషాలు కనిపిస్తాడు.

అయితే తాజాగా ఈ విలన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తెలుగులో అంత క్రేజ్ ను అందించిన ఈ సినిమాపై కామెంట్స్ చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పుష్ప’ వల్ల తనకు కొత్తగా క్రేజ్ ఏమీ రాలేదని అతనే తేల్చేశాడు. కేరళను దాటి మిగతా ప్రాంతాల్లో ‘పుష్ప’ వల్ల మీకు ఎక్కువ క్రేజ్ వచ్చిందా అని అడిగితే.. లేదు అని సమాధానం ఇచ్చాడు ఫాహద్. అలా అని తాను ఎవరినీ తప్పుబట్టడం లేదని కేవలం సుక్కు మీద ఉన్న అభిమానంతోనే చేశాను.. నాకు కేవలం మలయాళం సినిమాలే మంచి గుర్తింపు తెచ్చాయ్యని తేల్చి చెప్పేసాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..