‘వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అని మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇది దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు సరిగ్గా సరిపోతుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఫాఫ్ ఎంతో చురుకుగా ఉంటున్నాడు. కుర్రాళ్లతో పోటీపడి మరీ పరుగులు చేస్తున్నాడు. అంతేకాదు కళ్లు చెదిరే క్యాచ్‌లు ఆడుకుంటున్నాడు. ఫాఫ్ విన్యాసాలను మనం ఐపీఎల్‌లో ఇప్పటికే చూశాం. అయితే తాజాగా మైండ్ బ్లాకింగ్ క్యాచ్ పట్టాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మోరిస్‌విల్లే సాంప్, ఢిల్లీ బుల్స్ జట్లు తలపడ్డాయి. మోరిస్‌విల్లే బౌలర్ అమీర్ హంజా వేసిన రెండో ఓవర్‌లో బుల్స్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ భారీ షాట్ ఆడగా.. ఆఫ్ సైడ్ బంతి వేగంగా దూసుకెళ్లింది. వేగంగా పరుగెత్తిన ఫాఫ్.. ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు అందరూ షాక్ అయ్యారు. బౌండరీ వెళ్లాల్సిన బంతిని ఫాఫ్ ఊహించని విధంగా క్యాచ్ పట్టాడు. డుప్లెసిస్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ’40 ఏళ్ల వయసులో ఆ క్యాచ్ ఏంది సామీ’, ‘మైండ్ బ్లాకింగ్ క్యాచ్’, ‘కళ్లు చెదిరే క్యాచ్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: PV Sindhu Marriage: డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి.. వరుడు ఎవరంటే?
ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ మరో రెండు క్యాచ్‌లు కూడా పట్టాడు. ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లో టామ్ బాంటన్ ఇచ్చిన క్యాచ్ అందుకున్నాడు. ఏడో ఓవర్‌లో అద్భుత క్యాచ్‌తో రోవ్‌మన్ పావెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 రన్స్ చేసింది. టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్. ఛేదనలో మోరిస్‌విల్లే మరో ఐదు బంతులు ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి 90 రన్స్ చేసి గెలిచింది. బ్యాటింగ్‌లో మాత్రం ఫాఫ్ విఫలమయ్యాడు. మూడు బంతుల్లో ఓకే రన్ చేశాడు.
WHAT A STUNNER FROM 40-YEAR-OLD FAF DU PLESSIS IN T10 LEAGUE 🤯 pic.twitter.com/LV9KLNHuPt
— Johns. (@CricCrazyJohns) December 2, 2024