Instagram, Facebook: ప్రముఖ మెసేజింగ్ యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ల సేవలు నిలిచిపోయాయి. గత కొద్ది సేపటి నుంచి అవి పనిచేయడం లేదు అని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ తమ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయా అని ట్వీట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక, యూజర్స్ ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే లాగౌట్ అయినట్లు వస్తోందని ట్విట్టర్‌లో నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పరిస్థితి కూడా అంతే అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ట్విట్టర్ లో #Facebookdown, #Instagramdown.. ఈ రెండు ప్రస్థుతం ట్రెండింగ్ లోకి వచ్చాయి.
Instagram: నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు..
Show comments