Indian Ocean : ప్రస్తుత సంవత్సరం తొలినాళ్లలోనే దాదాపు 200చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయని భారత నావికాదళం తెలిపింది. ఈ పడవలు చట్టవిరుద్ధంగా, సమాచారం లేకుండా ప్రవేశించాయని, ఇవి రెగ్యులేటెడ్ కానివని వెల్లడించింది. భారత ఈఈజెడ్(ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్) సమీపంలో ఈ బోట్లు చేపల వేట కొనసాగిస్తున్నాయని పేర్కొంది. చైనా నౌకలతోపాటు మరికొన్ని ఐరోపా దేశాల నౌకలు సైతం హిందూ మహాసముద్రంలో చేపల వేట నిర్వహిస్తున్నాయని నావికాదళం తెలిపింది. ఉత్తర హిందూ మహా సముద్ర ప్రాంతంలోనే ఇవి కార్యకలాపాలను సాగిస్తున్నాయని పేర్కొంది.
Read Also: Snake in Fridge: బుస్ అని సౌండ్ వస్తే ఏంటని డోర్ తీశారు.. అంతే ఒక్కసారిగా షాక్..
ఇటీవల కాలంలో డీప్‌సీ ఫిషింగ్ ట్రాలెర్లు, ఇతర పడవల కారణంగా హిందూ మహాసముద్రంలో చైనా పడవల కదలికలు పెరిగాయి. చైనా తీరానికి దూరంగా డీప్‌సీ ఫిషింగ్ ట్రాలెర్లు ఇక్కడికి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సముద్ర గర్భం పరిస్థితులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. 2015 నుంచి 2019 మధ్య 500 చైనా డీప్‌సీ ట్రాలెర్లు ఇక్కడకు వచ్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. హిందూ మహాసముద్రంలో చేపల వేట సాగిస్తున్న చైనా పడవల్లో మూడో వంతు ఎటువంటి గుర్తింపు లేనట్లు సమాచారం. వీటికి తోడు రెండు పరిశోధన నౌకలు కూడా ఉన్నాయి. వీటికి క్షిపణులను ట్రాక్ చేయగల సామర్థ్యం ఉంది.
