Extra Ordinary Man : బ్రష్ వేసుకో సాంగ్.. నితిన్ లుక్ వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. యంగ్ బ్యూటీ శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే బ్రష్ వేసుకో అంటూ సాగే సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. సాంగ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా నితిన్ షర్ట్‌లో నుంచి బ్రష్ తీస్తున్న మరో లుక్‌ను విడుదల చేస్తూ.. రేపు (నవంబర్ 10న) సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొస్తున్నట్టుగా తెలియజేశారు. నితిన్ సూపర్ స్టైలిష్‌గా కొంచెం మాస్ టచ్ ఇస్తూ కనిపిస్తున్న తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన డేంజర్ పిల్లా పాటకు మంచి స్పందన వస్తోంది.రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌లో నితిన్ స్టైలిష్ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాడు.
అరే నువ్వొక జూనియర్ ఆర్టిస్ట్‌వి.. అంటే ఎక్స్‌ట్రాగాడివి.. ఒక ఆర్డినరీగాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. అంటూ టీజర్‌లో కొడుకు క్యారెక్టరైజేషన్ గురించి రావు రమేశ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా.. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఇటీవలే లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఇదిలా ఉంటే నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో VNRTrio (వర్కింగ్ టైటిల్)లో కూడా నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు..
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!