Site icon NTV Telugu

Nagaraju Murder: నాగరాజు హత్యలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు

67a3bfef 07c0 496f 8357 78aa627d29e1

67a3bfef 07c0 496f 8357 78aa627d29e1

సరూర్‌ నగర్ లో హత్యకు గురైన నాగరాజు కేసుపై మాజీ మంత్రి చంద్ర శేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై మంత్రులు ఎవ్వరు స్పందించడం లేదని, ఒక చిన్న ఫోన్ తోనే ఎస్సి కమిషన్ స్పందించిందని పేర్కొన్నారు. బాధిత అమ్మాయికి ప్రభుత్వం ఆదుకోవాలని, నిందుతుల‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకరు ఎంఐఎం, ఒకరు టీఆరెస్ వ్యక్తి కూడా ఈ మర్డర్ లో ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయికి రక్షణ కల్పించాలని, గవర్నర్ చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. మతపరమైన చర్యలను ఆపాలని అన్నారు. నిందితులకు ఉరి శిక్షవేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎస్సీ మోర్చా ప్రసిడెంట్ బాషా మాట్లాడుతూ.. నాగరాజు హత్య జరిగి ఐదు రోజులు గడిచిన ప్రభుత్వం స్పందించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి, హోమ్ మినిష్టర్ నుంచి కనీస స్పందన లేదని మండిప‌డ్డారు. రాష్ట్ర వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేసి చంపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని బాషా అన్నారు. బీజేపీ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Drugs Rocket: మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

Exit mobile version