NTV Telugu Site icon

Kalki 2898 AD : బుజ్జి పరిచయ వేదికకు సర్వం సిద్ధం..స్పెషల్ గా నిలువనున్న ఆ బైక్ స్టంట్ షో..?

Prabhas

Prabhas

Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్,లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ సిఎంమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమానుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read AlsoNTR 31 : ఎన్టీఆర్ సరసన నటించనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?:

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ను ఇటీవల మేకర్స్ రివీల్ చేసారు.కల్కి సినిమాలో ప్రభాస్ మిత్రునిగా ఓ కారు ఉంటుందని మేకర్స్ తెలిపారు.ఆ కారు పేరు “బుజ్జి” అని మేకర్స్ రివీల్ చేసారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని సమాచారం.అయితే బుజ్జి పాత్రకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే తాజాగా మే 22 న బుజ్జి ని పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.తాజాగా బుజ్జి పరిచయ వేదికకు సర్వం సిద్ధం అయింది.సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈవెంట్ ప్రారంభమవనుంది.అయితే ఎగిరే కారులో ప్రభాస్ స్పెషల్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.ఈ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్ గా ఉండనున్నట్లు సమాచారం.ఈ ఈవెంట్ లో స్పెషల్ బైక్ స్టంట్ షో ఉండనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బైకర్స్ స్టంట్  ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.

Show comments