చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్ షాంఘై ఆటో షోలో తన కొత్త ఆల్- ఎలక్ట్రిక్ సూపర్ కార్ యాంగ్ వాంగ్ యూ-9ని పరిచయం చేసింది. ఈ కారు పరిచయంతో పాటుగా.. కంపెనీ ఒక సంచలనాత్మక సాంకేతికతను కూడా ప్రదర్శించింది. దీనిని Disus-X అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోడ్డుపై మూడు చక్రాలతో కూడా పరుగెత్తగలదన్నామాట. BYD వేదికపై యాంగ్ వాంగ్ యూ-9 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపట్టగానే.. అది మీడియా ముందు బౌన్స్ అవుతూ కనిపించింది. ఇది Mercedes-Benz GLE ఎయిర్ సస్పెన్షన్ లో కనిపించే విధంగా ఉంటుంది. అయితే.. BYD సూపర్ కారులో ఉపయోగించినది మరింత అధునాతనమైన ఫీచర్ అని చెబుతున్నారు.
Read Also : Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ ప్లేస్ ఆయనకే..
ఇది మాత్రమే కాదు.. కారు కేవలం మూడు చక్రాల మీద డ్రైవింగ్ చేయడం.. కారు ఫ్రంట్ రైడ్ వైపు చక్రం లేకపోయినా.. కారు చాలా సాఫీగా నడుస్తున్నట్లు కూడా చూపించారు. Disus-X సస్పెన్షన్ సిస్టమ్ లో ఇంటెలిజెంట్ డంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ సూపర్ కార్ కి ఆల్ రౌండ్ కంట్రో ల్ ని అందిస్తాయి. కారు ముందు చక్రం పాడైపోయినా లేదా కార్ టైర్ కూడా పగిలిపోయినా.. ఈ సస్పెన్షన్ సిస్టమ్ కారును కొద్దిగా ముందు వైపునకు వంచుతుంది. దీని కారణంగా బ్రేక్ రోటర్లు రోడ్డును తాకవు.. కారు ఎటువంటి సమస్య లేకుండా సాధారణంగా కదులుతుంది.
Read Also : Jharkhand students: రిక్రూట్‌మెంట్ విధానంపై జార్ఖండ్ విద్యార్థి సంఘం నిరసన