Site icon NTV Telugu

Shahid Afridi: బీసీసీఐని కాదని ఐసీసీ ఏం చేయలేదు: షాహిద్ అఫ్రిదీ

3

3

ఆసియా కప్‌-2023 వేదికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. ఇదే విషయమై ఫిబ్రవరి 4న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జైషాతో పీసీబీ ఛైర్మన్ నజామ్‌ సేథీ ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. నిజానికి ఈ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీ కోసం తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ఉద్దేశం లేదని బీసీసీఐ చెబుతోంది. టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించాలని పట్టుబడుతోంది. మరో పక్క ఆసియా కప్‌ కోసం టీమిండియా ప్లేయర్లు పాక్‌కు రాకపోతే.. భారత్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని పీసీబీ అంటోంది. మరోసారి మార్చిలో ఏసీసీ భేటీ తర్వాతనే ఈ ఆసియా కప్‌ నిర్వహణపై ఓ క్లారిటీ రానుంది. తాజాగా ఇదే విషయమై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు.

Asia Cup: Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

“ఎవరైనా సరే తమ కాళ్ల మీద గట్టిగా నిలబడలేకపోతే.. నిర్ణయాలను కూడా బలంగా తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇలాంటివారు చాలా అంశాలను పరిశీలించి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అదే భారత్‌ను చూస్తే తమ వైఖరి గట్టిగా చెప్పడానికి కారణాలు చాలా ఉన్నాయి. వారు ఆర్థికంగానూ, ఆటపరంగానూ బలంగా మారిపోయారు. లేకపోతే ఆ ధైర్యం వారికి రాదు. బీసీసీఐ చాలా స్ట్రాంగ్‌. అందుకే నిర్ణయాలను తీసుకోగల స్థాయిలో ఉంది. ఇక ఆసియా కప్‌ కోసం పాక్‌లో భారత్‌ పర్యటిస్తుందని నేను అనుకోవడం లేదు. భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను పాక్‌ బాయ్‌కాట్ చేస్తుందనే ఆలోచనా లేదు. అయితే, కచ్చితంగా మనం ఒక పాయింట్‌కు కట్టుబడి ఉండాలి. ఇలాంటి సమయంలోనే ఐసీసీ పాత్ర చాలా కీలకం. వారే ముందుకొచ్చి సమస్యను పరిష్కరించాలి. కానీ, బీసీసీఐ ఎదుట ఐసీసీ కూడా ఏమి చేయలేదనేది నా భావన. ఇక వ్యక్తిగతంగా పాక్‌ వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనేది నా ఉద్దేశం. ఇలాంటి నిర్ణయాలన్నీ ఉన్నతస్థాయిలోనే జరగాల్సి ఉంది. ఇక మన బోర్డు ఆర్థిక పరిస్థితినిబట్టి ప్రణాళికలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదు” అని అఫ్రిది వ్యాఖ్యానించాడు.

Asia Cup: Womens T20 WorldCup: ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం

Exit mobile version