సహారా ఎడారి నుంచి వచ్చే పసుపు – నారింజ రంగు పొగమంచు గ్రీస్ దేశంలోని కొన్ని ప్రాంతాలను కప్పివేసి అద్భుతమైన దృశ్యాలను వాతావరణం సృష్టించింది. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రజలు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో ద్వారా పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు అధికారులు ఆరోగ్య హెచ్చరికలను జారీ చేశారు. గ్రీక్ వాతావరణ కేంద్రం తాజా వాతావరణ పరిస్థితులను.. ఆఫ్రికా నుంచి దుమ్ము కదలికకు అనుకూలంగా ఉన్నాయని.. వాతావరణంలో పెరిగిన సాంద్రతలలో ఇది కనిపిస్తుందని ముఖ్యంగా దేశంలోని దక్షిణాన దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని చెప్పఁపోకొచ్చారు అధికారులు.
Also Read: Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ
ఈ నేపథ్యంలో మారిన వాతావరణ పరిస్థితులలో ఏథెన్స్ లోని ప్రజలు గ్రీకు రాజధాని సమీపంలోని కొండల నుండి పసుపు – నారింజ రంగు పొగమంచును గమనిస్తున్నట్లు చూపించాయి. ఈ పరిస్థితులను ఏథెన్స్ “మార్స్ కాలనీ” లాగా ఉందని గ్రీక్ వాతావరణ శాస్త్రవేత్త ‘కోస్టాస్ లగౌవార్డోస్’ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక ఉత్తర ఆఫ్రికా నుంచి గ్రీస్, అలాగే మరికొన్ని ప్రాంతాలకు వెళ్లే ధూళి మేఘాలు అప్పుడప్పుడు సంభవించే ఒక విషయం. వీటివల్ల శ్వాస ప్రమాదాల హెచ్చరికలను కూడా ప్రేరేపిస్తుంది.
Also Read: CSK Super Fan: ధోనీని కలవాలని ఉంది.. 103 ఏళ్ల సీఎస్కే సూపర్ అభిమాని వీడియో వైరల్
ఇకమరోవైపు తూర్పు మెడిటరేనియన్ దేశం సైప్రస్ లో కూడా దుమ్ముతో కప్పబడింది. ఉత్తర ఆఫ్రికా పై అల్పపీడన వ్యవస్థ ఏప్రిల్ మధ్యలో సైప్రస్ పై చాలాసార్లు దుమ్మును ప్రేరేపించింది. ఇందులో భాగంగా “ఆకాశాన్ని చీకటిగా మారుస్తుంది.. అలాగే గాలి నాణ్యతను తగ్గిస్తుంది” అని నాసా తెలిపింది. ఇలా మరికొన్ని రోజులు సైప్రస్, గ్రీస్ మీద ఈ దుమ్ము ప్రభావం ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. ఇక స్థానిక మీడియా ప్రకారం గ్రీస్‌లోని కొన్ని భాగాలు నారింజ రంగులోకి మారడం, అలాగే ఫిన్‌లాండ్ అసాధారణమైన తెల్లటి మంచు దుప్పటిని ఫేస్ చేస్తోంది. ఉత్తర యూరోప్ లో సాధారణం కంటే భారీ మంచు ప్రభావం లాంటి పరిస్థితులు కారణంగా దక్షిణ ఫిన్లాండ్ అంతటా ప్రజా రవాణా నిలిచిపోయిందని తెలిపింది.
