NTV Telugu Site icon

Etela Rajender: కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడే తప్ప అభివృద్ధి చేయలేదు

Etela

Etela

సిద్దిపేట జిల్లాల వర్గల్ మండలంలోని నాచారం లక్ష్మీ నరసింహస్వామిని గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మీద లక్ష్మీనరసింహస్వామి కూడా కోపంతో ఉన్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నాడే తప్ప అభివృద్ధిని చేయలేదు అని ఆరోపించారు. ప్రతి పోలింగ్ బూత్ కి 300 మద్యం సీసాలు 50వేల రూపాయలు కేసీఆర్ ఇస్తాడట.. అవన్నీ తీసుకొని ఈటలకే ఓటేస్తామని ఇక్కడ యువత చెప్తున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు.

Read Also: Reba Monica John: ట్రెడిషనల్ డ్రెస్ లో మెరుస్తున్న రెబా మోనికా..

కేసీఆర్ ను ఓడగొట్టకపోతే గజ్వెల్ ప్రజలు బాగుపడరు.. మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్ ప్రజల భూములు గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ కేసీఆర్.. మళ్ళీ వస్తే భూములు కాదు ఊర్లకి ఊర్లె గుంజుకుంటారు అని ఆయన హెచ్చరించారు. నాచారంలో 1250 ఎకరాల మీద కేసీఆర్ కన్నుపడింది.. కేసీఆర్ కి ఓటు వేసి గెలిపించాక భూములు గుంజుకోకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా.. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే గజ్వేల్ కాదు మొత్తం తెలంగాణే అదోగతి పాలు అవుతుంది.. సొమ్ము కేంద్రానిది సోకు కేసీఆర్ ది అంటూ హుజురాబాద్ ఎమ్మల్యే, గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.