Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్.. నీ జాగీరు కాదు !

సీఎం కేసీఆర్‌ పై మరోసారి మాజీ మంత్రి, బీజేపి నేత ఈటెల రాజేందర్ ఫైర్‌ అయ్యారు. మిస్టర్ సిఎం కేసీఆర్‌.. . తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదని…నేను ఏం పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని మండి పడ్డారు. ఏం పదవి, ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి.. తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ లో ఎంట్రీ దొరికిందని… పదవి కూడ రాబోతుంది… ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు.
బీజేపీలో ఉన్న వారికి దళిత బందు ఇవ్వబోమని అంటున్నారు… ఎలా ఇవ్వరో తాను చూస్తానని హెచ్చరించారు. తన కు అన్నం పెట్టే వారు, కారు డ్రైవర్ ను కూడా లేకుండా చేస్తారంటనని ఫైర్‌ అయ్యారు ఈటల రాజేందర్‌.

Exit mobile version