AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి సౌందర్యానికి, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు ఆఫ్రికా ఖండం. కానీ, అదే ఆఫ్రికాలోని ఎస్వతిని (గతంలో స్వాజిలాండ్) అనే చిన్న దేశం నేడు ఒక భయానక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యధిక హెచ్ఐవీ వ్యాప్తి ఉన్న దేశంగా ఎస్వతిని రికార్డులకు ఎక్కింది. దారిద్య్రం, అవగాహన రాహిత్యం, కొన్ని పురాతన సామాజిక ఆచారాలు ఒక జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం సాయం చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి.
సుమారు 12 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో, దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నారు. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న యువతపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. కొత్తగా నమోదవుతున్న కేసులలో యువతులే అధికంగా ఉండటం గమనార్హం.
Also Read
ముఖ్య కారణాలు ఇవే..
దేశంలో 60 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ఉపాధి కోసం పురుషులు పొరుగు దేశాలకు వలస వెళ్లడం, అక్కడ అసురక్షిత సంబంధాల వల్ల వ్యాధిని తిరిగి తమ గ్రామాలకు తీసుకురావడం ప్రధాన కారణం. ఇక్కడ బహుభార్యత్వం చట్టబద్ధం. ‘రీడ్ డ్యాన్స్’ వంటి ఉత్సవాలలో వేలాది మంది యువతుల నుంచి రాజు కొత్త భార్యను ఎంచుకునే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటువంటి విచ్చలవిడి సంబంధాలు వైరస్ వ్యాప్తికి రాజమార్గం వేస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
హెచ్ఐవీని నిరోధించే ‘లెనాకాపవిర్’ వంటి అత్యాధునిక ఔషధాల కొరత దేశాన్ని పట్టిపీడిస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన మందుల సరఫరాలో జాప్యం వల్ల బాధితులకు సరైన చికిత్స అందడం లేదు. ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా ఉచితంగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ అందిస్తుండటంతో మరణాల రేటు కొంత తగ్గింది. అయినప్పటికీ.. కొత్త ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!