NTV Telugu Site icon

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం: వారందరికీ నిరుద్యోగ భృతి…

కరోనా సమయంలో దేశంలో లక్షలాది మంది ఉద్యోగావకాశాలు కోల్పోయారు.  ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ఇప్పటికే ఆడుకున్నాయి.  అయితే, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది.  కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయినవారికి నిరుద్యోగ భృతిని కల్పించేందుకు సిద్ధం అయ్యింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద నిరుద్యోగ భృతి కల్పించబోతున్నారు. 

 ఈ ఏడాది జులై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇది అమలులో ఉంటుంది.  గరిష్టంగా 90 రోజులపాటు ఈ పథకం కింద భృతి లభిస్తుంది.  అయితే, రెండేళ్లు ఉద్యోగం చేసి గరిష్టంగా 78 రోజులపాటు ఈఎస్ఐసి చందాదారులుగా ఉన్న వారు మాత్రమే ఈ భృతికి అర్హులు.  గతంలో ఈ పథకం కింద కేవలం 25 శాతం మాత్రమే భృతి లభించేది.  కానీ, ఇప్పుడు ఆ భృతిని 50 శాతానికి పెంచింది కేంద్రం.  అదే విధంగా గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తరువాత భృతికి అప్లై చేసుకోవాల్సి వచ్చేది.  కానీ, ఇప్పుడు దానిని 30 రోజులకు తగ్గించింది.  స్వయంగా గాని, ఆన్లైన్ ద్వారా గాని, పోస్ట్ ద్వారాగాని దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ఖాతాలో డబ్బు జమచేయబడుతుందని అధికారులు చెప్తున్నారు.