Allu Arjun: చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ చిన్న డ్యాన్స్ స్టెప్ వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమా గంగోత్రితో హీరోగా అల్లు అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మొదటి సినిమా సక్సెస్ కావడంతో వెంటనే సుకుమార్ ఆర్య సినిమాలో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత కెరీర్లో వెను తిరిగి చూస్కోవాల్సిన అవసరం లేకుండా స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లాస్ట్ సినిమా పుష్పతో పాన్ ఇండియా లెవల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనరిజం కనిపిస్తోంది. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు ఆయన నటించిన పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ చెబుతున్నారు.
Read Also:PBKS vs RR: రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్.. ఓడితే ఇంటికే.
ప్రస్తుతం అభిమానులంతా పుష్ప -2 (Pushpa 2) సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో అల్లు అర్జున్ గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. ఇది చదివిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ తో భయాందోళన చెందుతున్నారు. అల్లు అర్జున్ జాతకంలో దోషం ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అంతేకాదు ఆయన జాతకం ప్రకారం త్వరలో ఆయన నటించే సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా మిగలబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఆయన సినిమా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన జాతకంలో ఉన్న దోషం పోగొట్టుకోవాలని, ఆ దోషం పోవాలంటే జ్యోతిష్యుడిని కలిసి తన దోష పరిహారం చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా గనక చేయకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఇండస్ట్రీలో ఘోరంగా తయారైతుంది అంటూ ఒక వార్త నెట్టింట్లో లో వైరల్ అవుతుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు (Allu Arjun Fans) టెన్షన్ పడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది త్వరలోనే తెలుస్తుంది.
Read Also:Different Weather: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి.. ఎండలు.. వానలు..