NTV Telugu Site icon

Falcon Scam Case: ఫాల్కన్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్

Falcon

Falcon

Falcon Scam Case: ఫాల్కన్ కేసు విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ మాట్లాడారు. 2021 నుండి డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, ఫాల్కన్ ఇన్ వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ ఫాం పేరుతో డిపాజిట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో కావ్య, పవన్ లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు అమీర్ దీప్ తో పాటు సురేందర్ మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని, విదేశాలకు పారిపోయారన్న సమాచారంతో అవసరమైన చర్యలు తీసుకుంటుమని అయన అన్నారు. ట్రావెల్ డీటేయిల్స్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖలు రాశామని, ఇందుకు సంబంధించి మొత్తం 22 అకౌంట్లు అధికారులు గుర్తించారని తెలిపారు.

Also Read: Tuni Municipal Vice Chairman: తుని మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా!

ఈ మొత్తాన్ని వెబై‌సైట్, యాప్ లో ద్వారా ఈ డిపాజిట్లు వసూలు చేశారని, ఆన్ లైన్ లోనే డిపాజిట్‌దారులకు డిపాజిట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించే వారని తెలిపారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని, ఎక్కడ అత్యధిక లాభాలు తక్కువ సమయంలో వస్తాయంటే వాటిని అసలు నమ్మొద్దని సూచించారు. అమీర్ దీప్ బీహార్ కు చెందిన వ్యక్తని, ఇతని తండ్రి ఓ మాజీ ఆర్మీ అధికారని ఆయన తెలిపారు. విదేశీ కంపెనీలు ఉన్నట్లుగా క్రియేట్ చేసారని, ఆ కంపెనీలన్ని నకిలీవేనని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా 850 కోట్ల రూపాయలు కొంతమంది డిపాజిట్ దారులకు రిటర్న్ చేశారని, ఇంకా 850 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. మొత్తానికి నిందితులను పట్టుకోవడానికి మొత్తం మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ అన్నారు.