Mumaith Khan: చావు అంచు దాకా వెళ్లి వచ్చాను! ఆ ప్రమాదం వల్ల నా జీవితం తలకిందులైంది: ముమైత్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumaith Khan: ఒకప్పుడు తన డ్యాన్స్‌తో యూత్‌ను ఊపుఊపిన డ్యాన్సర్ ముమైత్ ఖాన్. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ..’ వెండి తెరపై ఆమె చేసిన డ్యాన్స్ కుర్రకారుల మదిలో నిలిచే ఉంటుంది. వరుస సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కొన్నేళ్ల పాటు వెండితెరపై తనదైన ముద్రను వేశారు ముమైత్. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరమైయ్యారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అంత సడన్‌గా తాను ఇండస్ట్రీకి ఎందుకు దూరమైయ్యారో ఈ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఒక ప్రమాదం కారణంగా చావు అంచు దాకా వెళ్లి వచ్చానని, ఆ ప్రమాదం కారణంగా తన జీవితం తలకిందులైందన్నారు. ఒకవేళ తాను నటిని కాకపోతే .. ఒళ్లంతా టాటూలు వేయించుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సొంతం చేసుకునేదాన్ని అని అన్నారు.
Also Read
- Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
- Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
ఆమె మాట్లాడుతూ.. ఆ ప్రమాదం వల్లే నా జీవితం తలకిందులైంది. దాని కారణంగా ఏడేళ్లపాటు మంచానికే పరిమితమైనట్లు చెప్పారు. తాను 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. నేను ఇండస్ట్రీ వదిలి ఎక్కడికి వెళ్లలేదు, ఒక ప్రమాదం కారణంగా మెదడులో నరాలకు దెబ్బతగిలింది, దాంతో డ్యాన్స్‌కు దూరంగా ఉన్నానంతే. ఈ ప్రమాదం కారణంగా కనీసం ఏడేళ్ల పాటు కదలకూడదని, బరువు కూడా ఎత్తకూడదని వైద్యులు చెప్పారు. ఆ టైంలో కేవలం మంచానికే పరిమితమయ్యాను. నా బిజీ లైఫ్ నుంచి రెస్ట్ తీసుకోడానికే దేవుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని భావిస్తున్నాను. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి మందులు య్యూజ్ చేయడంతో లావు అయ్యాను. ఆ టైంలో మా అమ్మ నన్ను కంటికిరెప్పలా చూసుకుంది. నిజానికి ఇప్పటికీ నేను ఏదైనా కొనాలంటే ఆవిడ అనుమతి లేకుండా కొనను అని అన్నారు.
తాజావార్తలు
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
-
AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!