Site icon NTV Telugu

Mumaith Khan: చావు అంచు దాకా వెళ్లి వచ్చాను! ఆ ప్రమాదం వల్ల నా జీవితం తలకిందులైంది: ముమైత్ ఖాన్

Mumaith Khan

Mumaith Khan

Mumaith Khan: ఒకప్పుడు తన డ్యాన్స్‌తో యూత్‌ను ఊపుఊపిన డ్యాన్సర్ ముమైత్ ఖాన్. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ..’ వెండి తెరపై ఆమె చేసిన డ్యాన్స్ కుర్రకారుల మదిలో నిలిచే ఉంటుంది. వరుస సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తూ కొన్నేళ్ల పాటు వెండితెరపై తనదైన ముద్రను వేశారు ముమైత్. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరమైయ్యారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అంత సడన్‌గా తాను ఇండస్ట్రీకి ఎందుకు దూరమైయ్యారో ఈ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఒక ప్రమాదం కారణంగా చావు అంచు దాకా వెళ్లి వచ్చానని, ఆ ప్రమాదం కారణంగా తన జీవితం తలకిందులైందన్నారు. ఒకవేళ తాను నటిని కాకపోతే .. ఒళ్లంతా టాటూలు వేయించుకుని గిన్నీస్‌ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సొంతం చేసుకునేదాన్ని అని అన్నారు.

READ ALSO: T20 World CupT20: Airtel, Jio, Vi చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తో.. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చు..!

ఆమె మాట్లాడుతూ.. ఆ ప్రమాదం వల్లే నా జీవితం తలకిందులైంది. దాని కారణంగా ఏడేళ్లపాటు మంచానికే పరిమితమైనట్లు చెప్పారు. తాను 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. నేను ఇండస్ట్రీ వదిలి ఎక్కడికి వెళ్లలేదు, ఒక ప్రమాదం కారణంగా మెదడులో నరాలకు దెబ్బతగిలింది, దాంతో డ్యాన్స్‌కు దూరంగా ఉన్నానంతే. ఈ ప్రమాదం కారణంగా కనీసం ఏడేళ్ల పాటు కదలకూడదని, బరువు కూడా ఎత్తకూడదని వైద్యులు చెప్పారు. ఆ టైంలో కేవలం మంచానికే పరిమితమయ్యాను. నా బిజీ లైఫ్ నుంచి రెస్ట్ తీసుకోడానికే దేవుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని భావిస్తున్నాను. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి మందులు య్యూజ్ చేయడంతో లావు అయ్యాను. ఆ టైంలో మా అమ్మ నన్ను కంటికిరెప్పలా చూసుకుంది. నిజానికి ఇప్పటికీ నేను ఏదైనా కొనాలంటే ఆవిడ అనుమతి లేకుండా కొనను అని అన్నారు.

READ ALSO: Apple AI Pin: షాకింగ్.. డిస్ప్లే లేని ఐఫోన్? స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు సిద్ధమైన యాపిల్!

Exit mobile version