Champion OTT Release Date: స్వప్న సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్’. రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్టు సినీ సర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి ఛాంపియన్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. కానీ దీనిపై ఇంకా చిత్ర బృందం నుంచి అధికారిక క్లారిటీ రాలేదు.
READ ALSO: SP Leader: అశ్లీల కంటెంట్ చూసి టెస్టోస్టెరాన్ పెరిగి, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
ఛాంపియన్ సినిమా కథ విషయానికి వస్తే.. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేస్తూ ఉండే మైఖేల్ (రోషన్), ఎప్పటికైనా ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. దానికి ఫుట్‌బాల్ సరైన దారి అని భావించి, ఫుట్‌బాల్‌లో ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తూ ఉంటాడు. అయితే ఇంగ్లాండ్ వెళ్లడానికి అవకాశం వచ్చిన ఒక తరుణంలో, అతని తండ్రి చేసిన పని అతనికి అడ్డంకిగా మారుతుంది. అయితే అతను ఇంగ్లాండ్ వెళ్లాలంటే, ఒకచోట తుపాకులు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో అనుకోకుండా అతను దారితప్పి తుపాకులు ఉన్న ట్రక్కుతో పాటు బైరాన్‌పల్లి గ్రామానికి చేరుతాడు. అతను ఆ తుపాకులను డెలివరీ చేసి ఇంగ్లాండ్ చేరుకున్నాడా? ఇంగ్లాండ్ చేరుకోవడానికి అడ్డంకిగా మారిన అతని తండ్రి చేసిన పని ఏమిటి? అసలు బైరాన్‌పల్లి గ్రామానికి వెళ్ళిన తర్వాత మైకేల్ ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
READ ALSO: Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?
