సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెన్సేషనల్ ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం తనకు 77 ఏళ్లు అని.. ఇంకా నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల సమయానికి పని చేసేందుకు అవసరమైన ఆరోగ్యం, ఉత్సాహం ఉండదని తెలిపారు. అందుకే ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Kiren Rijiju: “ఇది 1962 నాటి భారతదేశం కాదు”..చైనాకు కేంద్రమంత్రి వార్నింగ్..
వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని.. కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయని.. అప్పుడు తన ఆరోగ్యం సహకరించదని పేర్కొన్నారు. అంత ఉత్సాహం పని చేయలేనని.. శరీరం కూడా సహకరించదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అయితే పోటీ చేయను కానీ.. రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు..
1983లో రాష్ట్ర అసెంబ్లీకి సిద్ధరామయ్య అరంగేట్రం చేశారు. చాముండేశ్వరి నుంచి లోక్‌దళ్ పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచి.. మూడుసార్లు ఓటమి చవిచూశారు. ఇక గత ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలిచి తొమ్మిదోసారి రాష్ట్ర అసెంబ్లీలో సిద్ధరామయ్య అడుగుపెట్టారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా సిద్ధరామయ్య గెలుపొందారు. మళ్లీ కర్ణాటకలో 2028లో జరుగుతాయన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Konda Surekha : రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి…
మైసూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చేసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను సిద్ధరామయ్య నిలదీశారు. రాష్ట్రానికి తక్షణమే కరవు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 నియోజకవర్గాలకు గాను 136 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Vishwambhara : దుమ్ము రేపే ఫైట్ సీక్వెన్స్ షూట్ లో బిజీగా చిరు