ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 112.3 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీ (104) బాదాడు. జెమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) హాఫ్ సెంచరీలు చేయగా.. ఓలీ పోప్ (44), బెన్ స్టోక్స్ (44)లు రాణించారు. హ్యారీ బ్రూక్ (11) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ పడగొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్స్ తీసుకున్నారు.
Also Read: Varudu Kalyani: తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?.. వరుదు కళ్యాణి సెటైర్లు!
ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 13 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో (1.3) హ్యారీ బ్రూక్‌కు స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి యశస్వి పెవిలియన్ చేరాడు. దాంతో 13 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఉన్నారు. 7 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 27 రన్స్ చేసింది.
