NTV Telugu Site icon

ENGW vs IREW: ప్రచంచ రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్.. 275 పరుగుల తేడాతో విజయం..

Engw Vs Irew

Engw Vs Irew

ENGW vs IREW: బెల్‌ఫాస్ట్‌లో సోమవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐర్లాండ్‌ను 275 పరుగుల తేడాతో ఓడించింది. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ తన 31 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమాంట్ 139 బంతుల్లో 150 పరుగులు నాటౌట్‌గా నిలిచింది. అలాగే ఫ్రెయా కెంప్ 47 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టామీ బ్యూమాంట్ వన్డేల్లో 10వ సెంచరీని నమోదు చేసింది. నాట్ స్కివర్ బ్రంట్‌ ను అధిగమించి మహిళల ODIలో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.

Teacher Dance: డాన్స్‭తో రెచ్చిపోయిన పంతులమ్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఐర్లాండ్‌కు ఆరంభం చాలా ఘోరంగా ఉంది. ఐర్లాండ్ తొలి ఓవర్‌ లోనే రెండు వికెట్లు కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ కేట్ క్రాస్ తొలి ఓవర్‌లోనే గాబీ లూయిస్ (0), అమీ హంటర్ (2)లకు పెవిలియన్ దారి పట్టించారు. ఈ తొలి షాక్ నుంచి తేరుకోలేకపోయిన ఐర్లాండ్ జట్టు కేవలం 16.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ జట్టులో ఉనా రేమండ్ హోయ్ అత్యధికంగా 22 పరుగులు చేసింది. ఉనా ఒక్కటే రెండంకెల స్కోరుకు చేరుకోగా, నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతాలు కూడా తెరవలేదు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కేట్‌ క్రాస్‌ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. అదే సమయంలో లారెన్ ఫైలర్ 6 ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకుంది. ఫ్రెయా కెంప్, జార్జియా డేవిస్ చెరో రెండు వికెట్లు తీశారు.