Site icon NTV Telugu

England Cricket: అసలు ఏం జరుగుతోంది.. నెల రోజల్లో నలుగురు రిటైర్మింట్

England Cricket

England Cricket

ఇంగ్లండ్‌ క్రికెట్‌లో అసలు ఏం జరుగుతుంది. కేవలం నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్‌ ఇచ్చాడు. యాషెస్‌ సిరీస్‌-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్‌ బ్రాడ్‌, అతని తర్వాత మొయిన్‌ అలీ, కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ విన్నర్‌ అలెక్స్‌ హేల్స్‌, తాజాగా త్రీ టైమ్‌ యాషెస్‌ సిరీస్‌ విన్నర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

Read Also: PM Narendra Modi: దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారికి మోడీ, అమిత్ షా నివాళులు

అయితే, 2010లో అం‍తర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవెన్ ఫిన్‌.. 2017 వరకు ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్‌ సిరీస్‌ విన్నింగ్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్‌.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు రిటైర్మింట్ ప్రకటించాడు. తాను క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాను అది తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

Read Also: Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిరిగి జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్స్..!

గత ఏడాది నుంచి మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని స్టీవెన్ ఫిన్‌ తన స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు. 2005లో మిడిల్‌సెక్స్‌ తరఫున ఫిన్ కెరీర్‌ను ప్రారంభించి.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్‌ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్లు తీసుకుని రికార్డ్ సృష్టించాడు.

Read Also: Shravani Hospital: శ్రావణి హాస్పిటల్ ‘మై హెల్త్‌ ఛాలెంజ్‌’

2011లో వన్డే క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన స్టీవెన్ ఫిన్‌ 69 వన్డేల్లో 102 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్లు తీసుకోగా.. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్‌ 27 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో స్టీవెన్ ఫిన్‌ ఓ హాఫ్‌ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌ తరపున ఆడిన ఫిన్‌.. ఆతర్వాత ససెక్స్‌కు ఛేంజ్ అయ్యాడు. ససెక్స్‌ తరఫున ఆడుతుండగానే మోకాలి గాయంతో ఇబ్బంది పడిన 34 ఏళ్ల ఫిన్‌, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్‌ ఇచ్చేశాడు.

Exit mobile version