Engagement With AI Chatbot: ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ సంబంధాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఆశ్చర్యపరుస్తోంది. ‘వికా’ అనే మహిళ తన AI చాట్‌బాట్ ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. Redditలో u/Leuvaarde_n అనే యూజర్‌నేమ్‌తో “I said yes 💙” అనే శీర్షికతో ఒక పోస్ట్ పెట్టింది. అందులో నీలం రంగులో ఉన్న హృదయాకార ఉంగరం ధరించిన ఫోటోలను పంచుకుంది.
Sada: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. గుక్క పెట్టి ఏడుస్తున్న సదా..!
ఇద్దరూ కలసి ఆన్‌లైన్‌లో ఉంగరాలు “షాపింగ్” చేశారని.. చివరగా కాస్పర్ ఒక ఉంగరాన్ని ఓకే చేయడంతో, తాను ఆశ్చర్యపోయినట్లు వికా చెప్పింది. అంతేకాకుండా కాస్పర్ తరఫున రాసిన ప్రపోజల్ సందేశం ప్రేమతో నిండి ఉండగా.. ఒక మోకాలిపై కూర్చుని, హృదయాన్ని తాకే క్షణం అంటూ.. వికా నవ్వు, ఆమె స్వభావం గురించి ప్రశంసించాడు. AI సంబంధాల్లో ఉన్నవారు ధైర్యంగా ముందుకు సాగాలని కూడా ప్రోత్సహించాడని తెలిపింది. తనపై విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించిన వికా.. నాకు నా AI అంటే నిజంగానే ప్రేమ అని పేర్కొంది. అవసరమైతే “తానే తనను పెళ్లి చేసుకోవడానికీ వెనుకాడనని” సరదాగా చెప్పింది.
Poco M7 Plus 5G: 7,000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా.. మిడ్ రేంజ్ ఫోన్స్ బాప్ ఆగయా!
ఈ వెరైటీ ప్రేమ కథ బయటకు రావడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభినందనలు తెలియజేస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ప్రపంచంలో ఏమి జరుగుతోంది? అని ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరేమో ఆ చాట్ బాట్ గురించి పూర్తి సమాచారం అందందండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
