NTV Telugu Site icon

IND vs ENG: లంచ్‌ బ్రేక్‌.. ఆరు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్! భారత్‌ విజయానికి 4 వికెట్లు

Ravichandran Ashwin Test

Ravichandran Ashwin Test

India hit back after Crawley’s fifty: వైజాగ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ కోల్పోయి 194 రన్స్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో (26) ఎల్బీగా ఔట్ అయిన అనంతరం అంపైర్లు లంచ్‌ బ్రేక్‌ను ప్రకటించారు. బెన్ స్టోక్స్ (0) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. మరోవైపు భారత్‌ విజయానికి ఇంకా 4 వికెట్లు మాత్రమే అవసరం. దాంతో రెండో సెషన్‌పై అందరి కళ్లు ఉన్నాయి.

ఓవ‌ర్‌నైట్ స్కోర్‌ 67/1తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ధాటిగా ఆడింది. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డుతున్న‌ నైట్ వాచ్‌మ‌న్ రెహాన్ అహ్మ‌ద్‌ (23)ను అక్ష‌ర్ ప‌టేల్ ఔట్ చేశాడు. అనంతరం ఆర్ అశ్విన్ రెండు వికెట్ల‌తో ఇంగ్లీష్ జ‌ట్టును కోలుకోలేని దెబ్బ‌కొట్టాడు. తొలి టెస్టు సెంచరీ హీరో ఓలీ పోప్‌ (36)ను అశ్విన్ ఔట్ చేశాడు. స్లిప్‌లో రోహిత్ శ‌ర్మ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో పోప్ పెవిలియ‌న్‌కు చిత్రాడు. ఆ కాసేప‌టికే బౌండ‌రీలు బాది జోష్ మీదున్న జో రూట్‌ (16)ను య‌ష్ బోల్తా కొట్టించాడు.

Also Read: IND vs ENG: సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్‌కు గాయం.. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎంట్రీ!

నిదానంగా ఆడుతున్న ఓపెనర్ జాక్ క్రాలే (73)ను కుల్దీప్ యాద‌వ్ ఎల్బీగా ఔట్ చేశాడు. లంచ్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా ఆఖ‌రి బంతికి బెయిర్‌స్టోను ఎల్బీగా ఔట్ చేసి.. ఇంగ్లండ్‌ను ఓట‌మి అంచుల్లోకి నెట్టాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 396, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 రన్స్‌ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 194/6 (42.4 ఓవర్లు) చేసింది.