NTV Telugu Site icon

Train Accident: ఇదేందయ్యా ఇది… ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు

Train

Train

ట్రైన్ పట్టాలు తప్పడం గురించి, ఒక ట్రైన్ మరో ట్రైన్ ను గుద్దడం గురించి మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. అయితే ట్రైన్ పట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం మీదకు దూసుకువచ్చిన సంఘటనను ఎప్పుడైనా చూశారా? అయినా వింటుంటేనే అది ఎలా సాధ్యం ఊహకు కూడా అందడం లేదు అనిపిస్తుంది కదా. అంత బరువైన ట్రైన్ మహా అయితే పట్టాల నుంచి కొద్దిగ పక్కకు వెళుతుంది అంతేకానీ ఎతైన ఫ్లాట్ ఫామ్ మీదకి ఎలా వస్తుంది అనిపిస్తుంది కదా. బైక్ ముందు టైర్ పైకెత్తి విన్యాసాలు చేసినట్లు లోకో ఫైలెట్ కూడా అలా చేశాడు అనుకోవడానికి రైళ్ల విషయంలో అలా చేయడం అసాధ్యం. అయితే రైలు ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో జరిగింది. అదేదో స్పీడ్ లో ఉండి అలా జరిగింది అనుకుంటే పొరపాటే. స్టేషన్ కు వచ్చి ఆగి ఉన్న రైలు ఆకస్మాత్తుగా అలా ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది.

Also Read: AP Assembly Session: నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో  రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా  ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఓ రైలు  రాత్రి 10:49 గంటలకు మధుర స్టేషన్ కు వచ్చి ఆగింది. ప్రయాణీకులందరూ రైలు దిగారు. అయితే తరువాత ఉన్నట్టుంది రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. అయితే అప్పటికే ట్రైన్ లో అందరూ దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ విషయం గురించి మధుర స్టేషన్ డైరెక్టర్, SK శ్రీవాస్తవ మాట్లాడుతూ ఇలా ఎందుకు జరిగిందో ఇంకా అర్థం కాలేదన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందన్నారు.  22:50 గంటలకు మథుర జంక్షన్ వద్దకు చేరుకున్న ఈ రైలు  5 నిమిషాల తర్వాత, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌ను బద్దలుకొట్టి బద్దలు కొట్టుకొని ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు వచ్చినట్లు తెలిపారు. దీని వల్ల ఫ్లాట్ ఫామ్ దెబ్బతిందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.