Eluru Police: వివిధ అవసరాలతో ఇబ్బంది పడే పేద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏలూరు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో వాడకుండా ఉండే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలను ఇతరులు ఉపయోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు.. కైండ్ నెస్ వాల్ పేరుతో ఏర్పాటు చేసిన వినూత్న ప్రయోగానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఏలూరు జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు..
READ MORE: CM Revanth Reddy : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
ప్రతి ఇంట్లోనూ ఉపయోగించకుండా పక్కన పెట్టేసిన వస్తువులు అంటే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలు తదితర సామాగ్రి సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది.. అలా వాడకుండా పక్కన పెట్టేసిన వస్తువులను వాటి అవసరమున్న వారికి అందించేందుకు ఏలూరు పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు పోలీస్ స్కూల్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో కైండ్నెస్ వాల్ పేరుతో ఒక ప్రత్యేక అల్మరాను ఏర్పాటు చేశారు. ఈ అల్మారా ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఇంట్లో ఉపయోగం లేని వినియోగంలో లేని.. వస్తువులు బట్టలు గాని బొమ్మలు గాని ఎలక్ట్రానిక్ వస్తువులు గాని ఇతర ఏ వస్తువులు అయినా ఈ అల్మారా లో పెట్టవచ్చు అయితే అప్పటికే ఈ అల్మారా లో ఏవైనా వస్తువులు పెట్టి ఉంటే అవి మీకు అవసరమైతే వాటిని ఉచితంగా తీసుకుని వెళ్లి మీరు వినియోగించుకోవచ్చు. ఇది ఈ కైండ్ నెస్ వాల్ ప్రత్యేకత. ఇప్పటివరకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డిలు సంయుక్తంగా టేక్ ఏ బుక్ గివ్ ఏ బుక్ పేరుతో పుస్తకాల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కు ప్రజల వద్ద నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు బాల ఈ అల్మారాలో ఉన్న బట్టలను ఉచితంగా తీసుకు వెళ్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
