NTV Telugu Site icon

Eluru Election: ఏకగ్రీవంగా ఏలూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ల ఎన్నిక

Eluru

Eluru

Eluru Election: ఏలూరు కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను, 30 మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా హాజరయ్యారు.

Also Read: Hindupur: హిందూపురంలో ఉత్కంఠకు తెర.. టీడీపీ కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నిక

ఈ ఎన్నికల్లో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు తొలి డిప్యూటీ మేయర్‌గా, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులు ఒప్పందంతోనే ముందుకు రావడంతో ఏకగ్రీవ విజయం సాధించారు. ఈ ఫలితంతో ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీ మరింత బలపడిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.