Site icon NTV Telugu

Elon Musk Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. పక్షవాతానికి గురైన మహిళ 20 ఏళ్ల తర్వాత రాయగలిగింది

Elon Musk Neuralink

Elon Musk Neuralink

ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ అద్భుతం చేసింది. ఆ కంపెనీ ఇటీవల మొదటిసారిగా ఒకే రోజులో ఇద్దరు వాలంటీర్ల మెదడుల్లో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)ని అమర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరు రోగులు కోలుకుంటున్నారు, వారికి కంపెనీ P8, P9 అని పేరు పెట్టింది. ఆ కంపెనీ X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది. వారు ఒకే రోజులో P8, P9లకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి అయ్యిందని తెలిపింది. న్యూరాలింక్ సహాయంతో, పక్షవాతం ఉన్నవారు ప్రయోజనం పొందుతారని, వారు తమ ఆలోచనా శక్తితో కంప్యూటర్ కర్సర్‌ను కదిలించగలరని భావిస్తున్నారు. కంపెనీ ఈ ప్రకటన తర్వాత, ఆడ్రీ క్రూస్ పోస్ట్ చేసింది. X ప్లాట్‌ఫామ్‌లో, ఆడ్రీ క్రూస్ తాను P9 అని, ఆమె తలలో న్యూరలింక్ చిప్ అమర్చబడిందని పోస్ట్ చేసింది.

Also Read:GSLV-F16 NISAR: కొనసాగుతోన్న పీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 16 కౌంట్‌డౌన్‌.. నేడు నింగిలోకి నిసార్‌..

ఆమె భావోద్వేగ క్షణాన్నిXలో పంచుకుంది. “నేను 20 సంవత్సరాలలో మొదటిసారి నా పేరు రాయడానికి ప్రయత్నించాను అని రాసుకొచ్చింది. తన పోస్ట్‌తో పాటు, ఆడ్రీ తన ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై వైలెట్ రంగులో రాసిన తన పేరు “ఆడ్రీ” ఫోటోను కూడా షేర్ చేసింది. అప్పటి నుంచి ఆమె పోస్ట్ వైరల్ అయింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మస్క్ స్వయంగా దానికి ప్రతిస్పందన ఇచ్చాడు. “ఆమె ఆలోచించడం ద్వారా తన కంప్యూటర్‌ను నియంత్రిస్తోంది. చాలా మంది అది సాధ్యమేనని గ్రహించడం లేదు” అని మస్క్ రాసుకొచ్చాడు.

Also Read:Tollywood : బోయపాటి, బాబీ, గోపిచంద్, అనిల్ బిజీ.. వాట్ హ్యాపెన్ కొరటాల?

అలాగే, ప్రపంచంలోనే న్యూరాలింక్ BCI అమర్చబడిన మొదటి మహిళ తానేనని ఆడ్రీ క్రూస్ చెప్పారు. ఆమె తన పేరు మీద X ప్లాట్‌ఫామ్‌లో అనేక పోస్ట్‌లను కూడా చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత తన ప్రయాణం ఎలా ఉందో వివరించింది. ఆడ్రీ క్రూస్ మాట్లాడుతూ.. ఇప్పుడు తాను 20 సంవత్సరాలలో మొదటిసారిగా కంప్యూటర్‌లో తన పేరు రాయగలిగానని, ఆటలు ఆడగలనని చెప్పింది. ఇప్పుడు ఆమె ఆపరేషన్ తర్వాత తన పురోగతిని బహిరంగంగా పంచుకుంది. మయామి విశ్వవిద్యాలయ ఆరోగ్య కేంద్రంలో తన మెదడులో న్యూరాలింక్ చిప్‌సెట్ అమర్చారని ఆమె చెప్పారు.

Also Read:Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం.. తరిమేసిన భర్త.. షాక్‌ ఇచ్చిన ప్రియుడు..

ఈ ఆపరేషన్ లో పుర్రెలో ఒక చిన్న రంధ్రం చేస్తారు. మోటార్ కార్టెక్స్‌పై 128 థ్రెడ్స్ జాగ్రత్తగా అమర్చుతారు. మోటార్ కార్టెక్స్ వాస్తవానికి మెదడులోని ఒక ముఖ్యమైన భాగం. ఇది మన శరీర కండరాల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. దీనికోసం, పని మరింత మెరుగ్గా ఖచ్చితమైన రీతిలో చేయడానికి డాక్టర్ రోబోటిక్స్ అసిస్టెంట్ సహాయం తీసుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో అమర్చిన చిప్ పరిమాణం దాదాపు ఒక చిన్న నాణెంతో సమానం.

Exit mobile version