Grokipedia: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ దృష్టి ఇప్పుడు వీకీపీడియా వైపు మళ్లినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే మనోడు ట్విట్టర్‌ను సొంతం చేసుకుని Xగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మస్క్ వికీపీడియాను బీట్ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. మస్క్ తన AI కంపెనీ xAI గ్రోక్ AI చాట్‌బాట్ ద్వారా “గ్రోకిపీడియా”ను సృష్టిస్తున్నట్లు ప్రకటించాడు. విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే xAI లక్ష్యం వైపు “గ్రోకిపీడియా” తదుపరి అడుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..!
గ్రోకిపీడియాను నిర్మించడంలో సహాయం చేయండి..
ఎలోన్ మస్క్ Xలో ఒక పోస్ట్ చేశారు. “మేము గ్రోకిపీడియా @xAIని నిర్మిస్తున్నాము. ఇది వికీపీడియాకు మించింది. నిజం చెప్పాలంటే విశ్వాన్ని అర్థం చేసుకునే xAI లక్ష్యం వైపు ఇది అవసరమైన అడుగు” అని పేర్కొన్నారు. మరొక పోస్ట్‌లో మస్క్ ఇలా రాశాడు.. “xAIలో చేరండి.. గ్రోకిపీడియాను నిర్మించడంలో సహాయపడండి. ఇది వికీపీడియా కంటే చాలా ఉన్నతమైన ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ రిపోజిటరీ అవుతుంది! ఇది ఎటువంటి వినియోగ పరిమితులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుంది” అని పేర్కొన్నారు. మస్క్ కొత్త గ్రోకిపీడియా స్పెషల్ ఏంటో కూడా చెప్పారు. గ్రోకిపీడియా ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన నాలెడ్జ్ బేస్ అవుతుందని పోస్ట్ చేశారు. ఇది రిచ్ మల్టీ-మోడల్ సోర్సెస్ నుంచి నిర్మిస్తున్నట్లు, దీంట్లో చిత్రాలు, ఆడియో, వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
వికీపీడియాపై మస్క్ వ్యతిరేక స్వరాలు..
మస్క్ నిరంతరం వికీపీడియాను తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఎన్‌సైక్లోపీడియా కంపెనీ నిర్వహిస్తున్న లాభాపేక్షలేని ఫౌండేషన్ అయిన వికీమీడియాను కూడా ఆయన ప్రశ్నించారు. వికీపీడియా వామపక్ష ధోరణిని కలిగి ఉందని, దాని నిధులను ప్రశ్నించారు. ఎలోన్ మస్క్ 2023 లో వికీపీడియాకు $1 బిలియన్ ఇస్తానని సరదాగా చెప్పారు. కానీ దాని పేరును “డి*కిపీడియా” గా మార్చవలసి ఉంటుందని చెప్పారు.
READ ALSO: Pakistan Balochistan crisis: బలూచ్‌లో బలం చూపని పాక్.. ఉగ్రమూకల చేతిలో చావుదెబ్బ
