Elephant tries to attack biker: అప్పుడప్పుడు సడెన్ గా అడవి జంతువులు దాడి చేయడం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్న అవి ఎందుకో ఒక్కసారిగా మీదకు వస్తూ ఉంటాయి. అందుకే అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం లేదంటే చాలా ప్రమాదమే జరగొచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు మన తప్పు వల్ల కాకుండా వేరే వారి తప్పులకు మనం బలవుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఓ బైకర్ పరిస్థితి మారింది.
Also Read: Dog shocks bride groom: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన కుక్క.. ఎంతపని చేసిందంటే
ఎక్కడో ఓ అడవిలో ఇద్దరు బైక్ మీద వెళుతున్నారు. అయితే దారిలో అనుకోకుండా వారి బైక్ ఆగిపోయింది. దీంతో వారి దిగి దానిని చూస్తున్నారు. ఇంతలో వెనకాల కారులో వచ్చిన వ్యక్తి దారికి అడ్డుతప్పుకోవాలంటూ హారన్ గట్టిగా కొట్టాడు. దీంతో ఆ పక్కనే ఉన్న ఓ పెద్ద ఏనుగుకు చిరాకుగా అనిపించింది. అది ఒక్కసారిగా బైకర్ పైకి దాడి చేయడానికి వచ్చింది. దీంతో అప్పుడే బైక్ బాగవడంతో దానిపై ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే భయంతో పొదల్లోకి వెళ్లిపోయాడు. ఏనుగు కూడా అతడిని వెంబడించడంతో భయంతో బైక్ పొదల్లోనే వదిలేసి పరుగుతీశాడు. అయితే ఏనుగు కూడా అతని వెనకాలే తరుముతూ పరిగెత్తింది. దీంతో హడలిపోయిన ఆ వ్యక్తి వెనకాల వస్తున్న ఓ కారులో ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఏ మాత్రం తేడా జరిగినా అతని ప్రాణాలు గ్యారెంటీగా పోయేవి.
అందుకే అడవి ప్రాంతంలో వెళ్లేటప్పుడు ఎక్కువ శబ్థాలు చేయడం, అరవడం లాంటివి చేయకూడదు. అడవి జంతువులు ఏ మాత్రం డిస్ట్రబ్ అయిన అది మన ప్రాణాల మీదకే వస్తుంది. అందుకే అడవిలో పర్యటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా అటవీ అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే దీనిని చాలా మంది వీక్షించారు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ బైకర్ చాలా లక్కీ అని అందుకే ప్రాణాలతో బయటపడ్డాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కారులో ఉన్న వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. అడవిలో వెళ్లే హారన్ కొట్టకూడదని ఆ మాత్రం తెలియదా నీ వల్ల ఒకరి ప్రాణం పోయేదని అంటున్నారు. మొత్తానికైతే అడవిలో వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ వీడియో.
