NTV Telugu Site icon

Elephant in Tamil Nadu: తమిళనాడులో ఏనుగు భీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి!

Elephant Hulchul In Tamilnadu

Elephant Hulchul In Tamilnadu

Two Women killed after Elephant attack in Tamil Nadu: తమిళనాడులో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. పోలం పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. మహిళలతో పాటు ఓ ఆవును కూడా ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు భీభత్సంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు భీభత్సంకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Ravichandran Ashwin: అభిమానులకు శుభవార్త.. అశ్విన్‌ వచ్చేస్తున్నాడు!

హోసూరూ డెంకనికోట సమీపంలో పోలం పనులు చేసుకుంటున్న వసంతమ్మ, అశ్వతమ్మ అనే ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. దాంతో చుట్టుపక్కల వారు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆపై ఓ ఆవును కూడా తొక్కి చంపింది. ఏనుగు చిత్తూరు సరిహద్దు గ్రామాల వైపు వెళ్లింది. దాంతో అటుగా ఉన్న గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇద్దరు మహిళల మృతికి కారణం అటవీశాఖ నిర్లక్ష్యమే అని జాతీయ రహదారిపై గ్రామస్థులు ధర్నాకు దిగారు.