Site icon NTV Telugu

Electoral bonds: ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ

Ec

Ec

సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. 763 పేజీలతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైట్‌ https://www.eci.gov.in/లో వివరాలను ఉంచింది.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. పార్ట్‌-1లో ఎన్నికల బాండ్లు ఎవరైతే కొనుగోలు చేశారోవారి వివరాలు పొందుపరిచారు. పార్ట్‌-2లో ఎన్‌క్యాష్‌ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను పొందుపరిచారు.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ డేటా వివరాలను ఎస్‌బీఐ ఈసీకి అందజేసింది.

డేటా అందుకున్న ఎన్నికల సంఘం.. గురువారం ఆ వివరాలు ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. రెండు పార్టులుగా వివరాలు తెలియజేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) పంచుకున్న ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది . ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు దాతలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేవారిలో అపోలో టైర్స్, లక్ష్మీ మిట్టల్, ఎడెల్వీస్, పివిఆర్, కెవెంటర్, సులా వైన్, వెల్స్పన్, సన్ ఫార్మా ఉన్నాయి.

రాజకీయ నిధుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా సమగ్ర సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌తో పంచుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఎస్‌బీఐని ఆదేశించింది. కొనుగోలుదారుల వివరాలతో పాటు, ఎలక్టోరల్ బాండ్ల ఎన్‌క్యాష్‌మెంట్ తేదీ మరియు విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎస్‌బీఐ ఈసీకి అందించింది. ఈ చర్య రాజకీయ విరాళాల పారదర్శకతను పెంపొందించడం, నిధులు గుర్తించదగినవి మరియు ఖాతాలో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

Exit mobile version