Site icon NTV Telugu

Assembly election 2023: తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

24e17a4e 57ea 494f 9c7f 82b247caee0b

24e17a4e 57ea 494f 9c7f 82b247caee0b

Assembly election 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7న మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 17 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో నవంబర్ 30న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, మిజోరంలో నవంబర్ 18న పోలింగ్ జరగనుంది.

Read Also: YS Jagan: వైసీపీ వరుస కార్యక్రమాలు.. సీఎం జగన్‌ దిశా నిర్దేశం

తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) 88 సీట్లు గెలుచుకుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. నవంబర్‌ 10వ తేదీ వరకు బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తారు. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 15వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్‌ 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి.

Read Also:Bhagavanth Kesari: హనుమకొండలో బతుకమ్మ ఆడిన కాజల్‌ అగర్వాల్, శ్రీలీల.. వీడియో వైరల్‌!

తెలంగాణలో ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా రేసులో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) 88 సీట్లు గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌.. ప్రస్తుతం దాని ఖాతాలో 19 సీట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందగా, తెలుగుదేశం 2 స్థానాల్లో విజయం సాధించింది.

Exit mobile version