NTV Telugu Site icon

Election Results: ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలు..

Maxresdefault

Maxresdefault

Andhrapradesh Election Results Countdown: సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం అయిన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రేపు(జూన్ 4) ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్ తెలియనుంది. ఉదయం 8 గంటల నుంచి వల్లూరు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక ముందుగా ఒంగోలు అర్బన్‌ సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉంది. తరువాత యర్రగొండపాలెం ఫలితం రానుంది.